Showing posts with label Village Life. Show all posts
Showing posts with label Village Life. Show all posts

Tuesday, 14 December 2021

మా పల్లె పండుగలు

 మా పల్లె పండగ/పండుగలు (My village popular festivals & how they are celebrated)

Important festivals (ముఖ్యమైన పండగ/పండుగలు) are listed below & details of how to celebrate follows.... (will use "పండుగ" in this page) మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.

  1. Sankranti (సంక్రాంతి): In Jan 14th, 15th & 16th...to celebrate Uttarayana (occasion marks the transition of the sun from the zodiac of Sagittarius -dhanuమనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
  2. Sivaratri (మహాశివరాత్రి): Great night of Lord Shiva celebrated in Feb / Mar, 14th day of the dark off of the lunar month of Megha/Palguna to "overcoming from darkness & ignorance in Life" కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
  3. Ugaadi (ఉగాది పండుగ)కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
  4. Sriraama Navami (శ్రీ రామ నవమి), భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
  5. Molakula pournami (మొలకుల పౌర్నమి)
  6. Ganesha Festival (వినాయక చవితి) ఊరంతా ఒక్కటిగా కలవడానికి
  7. పితృ అమావాస్య:- చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.
  8. Dussara(దసరా /ఆయుధ పూజ), ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది
  9. Deepavali /దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని
  10. Nomula Festival (నోముల పండుగ)..
  11. వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
  12. నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
  13. వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
  14. రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
  15. కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
  16. హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని
  17. అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని  
🙏 సర్వేజనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి👍🏻🙏🏻

Arts @ Festivals: 

1. సంక్రాంతి (Sankranthi) పండుగ: మూడు రోజులు కుటుంబ సమేతంగా జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ.. (January 14th, 15th & 16th) , to celebrate Uttarayana (occasion marks the transition of the sun from the zodiac of Sagittarius -dhanu) - festival is dedicated to the solar deity, Surya !
సంక్రాంతి మూడురోజుల పండుగ..కాని పక్షం రోజుల ముందునుంచే పండుగ వాతావరణం వచ్చేస్తుంది పల్లె వాకిట్లకి.. ప్రతి రోజు ఇంటి ముందర ఆవుపేడతో అలికి, ముగ్గులు వేసి రంగులతో నింపి- తంగేడు పూలతో అలంకరించి, పేడతో గొబ్బెమ్మ (Cow dung Ball) పెట్టి, దానిపై (గొబ్బెమ్మ) గుమ్మడిపూలు మరియు వెలించిన కడ్డీలు పెట్టి అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో, గాలిపటాలు ఎగురవేయడం ఒక పద్దతి.
  • మొదటి రోజు: భొగి (Bhogi) పండుగ, తెల్లవారు జామున "చలిమంట" వేసి అందులో పాత వస్తువులు కూడా వేసి ఆహుతి చేస్తారు.. !! ఇక కొన్ని ప్రాంతాలలో పిల్లలకి రేగుపళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు.
  • రెండవ రోజు: పెద్దల పండుగ, పెద్దలను గుర్తుకు తెచ్చుకొని, వారిని స్మరిస్తూ పూజ/బట్టలు పెట్టడం..ఆనవాయితీ.
  • మూడవ, ముఖ్యమైన రోజు: కనుమ (Kanuma) పండుగ, తెలవారక మునుపే(6 am ) లేసి ఇంటిలోని ప్రధాన గుమ్మాలలో నీరు చల్లి, వేపాకు వేసి, దాని మీద దొస పెట్టి, దొస మధ్యలో అన్నం ముద్దకు పసుపు, కుంకుమ బొట్టులు పెట్టి రెండు కడ్డీలు ఆ అన్నం ముద్దకు చెక్కి పుజ చేస్తారు..తరువాత ఆ మొత్తం (చల్ల అంటారు) పిల్లలు తీసుకొని వచ్చి గుడి దగ్గర నిల్చోని, మిగతా ఇల్లలోని పిల్లల్ని "చల్లో చల్ల" అని అరుస్తూ పిలుస్తారు..అమ్మయిలు పసుపు నీళ్ళు ఎత్తుకొచ్చి వరుసయ్యే అబ్బాయిలపై చల్లుతారు..అన్ని ఇళ్ళ నుంచి వచ్చిన తరువాత అందరు ఆ చల్లను తీసుకొని వెల్లి చెరువులోని నీళ్ళలో వేస్తారు.. (బావ - బావమరిది అయ్యే వారు - అన్నం ముద్దలు ఒకరిపై ఒకరు విసురు కొంటారు) 
    • ఫలహారంగ (7:30 am onwards): దోసలు, బెల్లం పాకం, చెట్నీ, అనప గింజల కూర, ఈ మధ్య కాలంలో కోడి కూరతో తిని తరువాత పనులలోకెల్తారు..
    • పశు సంపద (కోడేలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, బర్రెలు, దున్నపోతులు మొదలగు) నీళ్ళతో కడిగి, అలంకరిస్తారు (కొమ్ములకు రంగులు వేసి, కొప్పులు పెట్టి, గజ్జేలు కట్టి, రంగు రంగుల తాల్లు మరియు బట్టలు తోడిగి)...వేప, కానుగ మరియు ఆయుర్వెద చెట్ల చెక్కను (Bark) బాగా దంచి పసుసంపదకు తినిపించడం.. !
    • (10 am onwards) ఇంకో ప్రక్క, కోడి పందేలు, టెంకాయ పందేలు, జూదం, పొట్టేలు పందేలు, ఎద్దులతో ఆటలు (జల్లి కట్టు)..ఊరు అంతా కలిసి జరుపుకొంటారు..
    • ఇక సాయంకాలం (4pm), కొందరు (సాకలి, కొందరు రైతులు) ఊరిలోని అందరి ఇళ్ళలో నుంది బియ్యము, పెసరపప్పు, బెల్లం, నెయ్యి మరియు గుమ్మడి కాయ సేకరించి ఊరికు దగ్గరలోని పండుగ చేసే స్థలములో (కాటం / పసల దేవర) పరమాన్నం తయరు చేస్తారు.. ఇంటి దగ్గర ఆడవారు మాత్రం,  నేతిలో చేసిన అత్తిరసాలు చేసి పూజా సామగ్రి తో పండుగ చేసే స్తలానికి(పసల దేవర) చేరుకొంటారు.. ఇక మగవారు, పిల్లలు కలిపి అలంకరించిన పసు-సంపదను తీసుకొని పండుగ చేసే స్తలానికి (పసల దేవర) చెరుకొంటారు.. (~5:45 pm)
    • వండిన పరమాన్నం దేవుడికి పెట్టి, పసు సంపదలో చల్లి..అందరు తెచ్చిన అత్తిరాసములు పూజలో పెట్టి , వారు తెచ్చిన టెంకాయలు కొట్టి..చిట్లాకుప్పకు (కట్టెలు, కంపలు వేసిన కుప్ప) అగ్గి పెట్టి.. (6 - 7pm, సూర్యస్తమయం ) డప్పులు కొడుతూ, టపాసులు పేలుస్తూ ఎద్దులను సవారి తీయించి ఇంటికి తీసుకొస్తారు.. దేవుడి దగ్గర చేసిన పరమాన్నం, నేతి అత్తిరాసాలు ప్రసాదంగా అందరు తిని ఇళ్ళు చేరుకొంటారు..అంతటితో సంక్రాంతి పండుగ ముగుస్తుంది. 
    •   మీ వూరులో వేరే విధంగా చేస్తూఉంటే తెలియ చేయగలరు. ⁕
  



చిట్లాకుప్ప




















చల్ల..

చల్లో చల్ల..




Sunday, 3 May 2020

Village Life

Theme: Village Life is wonderful & is the "way of Life" for human and should experience instead of words :)  [ పల్లె జీవితం: ప్రకృతి ఒడిలో, అనందకరమైన పల్లె జీవితం, తరతరాల జీవనవిధానం!! మాటల్లో చెప్పలేని  మధురాను జ్ణాపకాలు..... ]
Write-up: Mekala V Reddy
Pictures: From Net or - Muralidhar Alagar (my ex. Team Member)

అడుసులో మడక దున్నడం అంత సులభమేమి కాదు సుమీ !! అదో కళ, అదో ప్రవీణ్యం. మంచి కాడేద్దులు, మడక ఉంటే అదో ఆనందం కూడా.....

 "పల్లె పాటలు ఎప్పుడు మనసుకు హత్తుకొంటాయి..కాని పల్లెలలో కొద్దిగా మార్పు వచ్చిందనిపిస్తుంది..ఏమంటారు !?" - Mekala V Reddy

భాషకన్నా భావం గొప్పది. భావాన్ని కళ్ళముందు లిఖిత పూర్వకంగా ఆవిష్కరింపజేసే వ్రాత గొప్పది. వ్రాసిన వ్రాతలు పుస్తకం నుంచి మనిషి మస్తకాలకి నేరుగా చేర్చే నేపథ్యంలో గాత్ర రూపం గొప్పది. కర్మేంద్రియాలు... జ్జానేంద్రియాలూ.... ఒకేసారి ఏక కాలంలో ప్రతిస్పందించే ప్రక్రియే ఈ...గీతాలాపన !! 😊 - from Net

  1. జొన్నచేలో నువ్ నిల్చొంటే..ఒయ్ రెడ్డి పాట - teasing song: girl & boy
  2. అందాల మాఊరి అక్కా .. సాంగ్ | సమ్మక్క సారక్క
  3. నా కొడుకా మా నందిరెడ్డి (Tragic song )  
పల్లె జీవితం తరతరాల జీవనవిధానం...!!
మన పల్లెలు నేర్పిన జీవిత పాఠాలు..🥰

😊పొలం గట్లపై నడిపించి, తడబడకుండా  నిలదొక్కుకోవటం  నేర్పింది.
👉 అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు  పాడై పొతే, నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.
🙏వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి, శోధించే తత్వం నేర్పింది.
👉సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి, అన్వేషణ నేర్పింది.
👏తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో, జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.
👏వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు తీయించి, ఐదు పైసల సంపాదన నేర్పింది.
🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి, ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  ప్రేమతత్వాన్ని నేర్పింది.
👏రాగడి  మట్టితో బండి గిర్రలు చేయించి, మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి, పనితనం నేర్పింది.
👉వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️
🙋 సంక్రాంతి  / బతుకమ్మ తంగేడు గునుగు పూల కోసం, తెల్లవారుతూనే  పొలం బాట పట్టించి, ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.
🤗పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే, నల్లాలం  ఆకు పసరు పోయించి, చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.
👌చెట్టుమీద మామిడికాయ గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.
 👉నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి,జివితమంటే బరువు కాదు బాధ్యత అని నేర్పింది.
👉బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.
😘ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,
👉ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి, ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.
👏పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల  విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే
ఒద్దికను నేర్పింది.
😋మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి, కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి, అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.
😊ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.
👉ముళ్ళు గుచ్చుకోకుండా,  ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.
🤗ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ, స్వయం సంపాదన ధోరణి నేర్పింది.
💕గోరింటాకు ని తెంపించి, దంచించి, చేతులకు అద్దించి, వికసించడం చూపించింది.
🤗వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది.
😘అత్తా, మామా, అన్నా  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.
🙏ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన మా ఊరుకు / పల్లెకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం.
😘నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా..
- ఆలోచించండి, ఆచరించండి: పిల్లలను పల్లెలలో కొద్దిరోజులు ఉంచడానికి.. - Mekala V Reddy (09 Feb '22)
----------------------------------------***----------------------------------------
 
బాతుల బెక, బెకలతో దారి అంతా ఆక్రమించి, వడి వడిగా వెల్తున్న వాటిని చూస్తూన్నంతలో ....ఎంతో క్రమపద్దతిలో మనకు దారి ఇచ్చిన విదానం అబ్బురపరుస్తొంది...కదా !!

ఆడరా బొంగరం....

 
  
మూగ జీవం (ఆవు) కూడా మనిషి బాధను అర్థం చేసుకోగలదు...... బాధను తీర్చలేకపోయినా!!






 వరి నాట్లు ఓ పండుగ వాతావరణం మరియు కొలహలం: నారు తీయడం, కట్టలు కట్టడం, అడుసు మడిలో వేయడం....ఒక పక్క అయితే... మడి దున్నకాలు ఓ పక్క, మడి నాటుతూ పాటలు పాడుతున్న పడుచులు ఒక వైపు ....





 వర్షం కురిసిన వేళ...... !! పోలం పనులు ముగించుకొని వడి వడిగా ఇంటివైపు అడుగులేస్తున్న ఆడపదుచు, ఆవు, లేగదూడలు....

----------------------------------------***----------------------------------------
యువతకి ఇవి కూడా పల్లె జీవితములో ఒక భాగము..
- గోడ దూకడము
- పంపు సెట్టు..
- బోరు పంపు..
- గడ్డి వాములు..
- చెరకు తోటలు..
- మిరప/వంగ తోటలు..

Kondareddygaripalli

కొండా రెడ్డి గారి పల్లి, పెద్దగొట్టిగల్లు  Native Place: where every stone & Tree have a story to tell.. నా ఊరు పల్లెటూరు ... ప్రకృత...