మా పల్లె పండగ/పండుగలు (My village popular festivals & how they are celebrated)
Important festivals (ముఖ్యమైన పండగ/పండుగలు) are listed below & details of how to celebrate follows.... (will use "పండుగ" in this page) మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.
- Sankranti (సంక్రాంతి): In Jan 14th, 15th & 16th...to celebrate Uttarayana (occasion marks the transition of the sun from the zodiac of Sagittarius -dhanu) మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
- Sivaratri (మహాశివరాత్రి): Great night of Lord Shiva celebrated in Feb / Mar, 14th day of the dark off of the lunar month of Megha/Palguna to "overcoming from darkness & ignorance in Life" కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
- Ugaadi (ఉగాది పండుగ), కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
- Sriraama Navami (శ్రీ రామ నవమి), భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
- Molakula pournami (మొలకుల పౌర్నమి),
- Ganesha Festival (వినాయక చవితి) ఊరంతా ఒక్కటిగా కలవడానికి
- పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
- Dussara(దసరా /ఆయుధ పూజ), ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది
- Deepavali /దీపావళి: పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని
- Nomula Festival (నోముల పండుగ)..
- వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
- నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
- వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
- రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
- కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
- హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని
- అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని
🙏 సర్వేజనాః సుఖినో భవంతు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి👍🏻🙏🏻
1. సంక్రాంతి (Sankranthi) పండుగ: మూడు రోజులు కుటుంబ సమేతంగా జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగ.. (January 14th, 15th & 16th) ,
to celebrate Uttarayana (occasion marks the transition of the sun from the zodiac of Sagittarius -
dhanu) - festival is dedicated to the solar deity,
Surya !
సంక్రాంతి మూడురోజుల పండుగ..కాని పక్షం రోజుల ముందునుంచే పండుగ వాతావరణం వచ్చేస్తుంది పల్లె వాకిట్లకి.. ప్రతి రోజు ఇంటి ముందర ఆవుపేడతో అలికి, ముగ్గులు వేసి రంగులతో నింపి- తంగేడు పూలతో అలంకరించి, పేడతో గొబ్బెమ్మ (Cow dung Ball) పెట్టి, దానిపై (గొబ్బెమ్మ) గుమ్మడిపూలు మరియు వెలించిన కడ్డీలు పెట్టి అలంకరిస్తారు. కొన్ని ప్రాంతాలలో, గాలిపటాలు ఎగురవేయడం ఒక పద్దతి.
- మొదటి రోజు: భొగి (Bhogi) పండుగ, తెల్లవారు జామున "చలిమంట" వేసి అందులో పాత వస్తువులు కూడా వేసి ఆహుతి చేస్తారు.. !! ఇక కొన్ని ప్రాంతాలలో పిల్లలకి రేగుపళ్ళు పోసి పెద్దలు ఆశీర్వదిస్తారు.
- రెండవ రోజు: పెద్దల పండుగ, పెద్దలను గుర్తుకు తెచ్చుకొని, వారిని స్మరిస్తూ పూజ/బట్టలు పెట్టడం..ఆనవాయితీ.
- మూడవ, ముఖ్యమైన రోజు: కనుమ (Kanuma) పండుగ, తెలవారక మునుపే(6 am ) లేసి ఇంటిలోని ప్రధాన గుమ్మాలలో నీరు చల్లి, వేపాకు వేసి, దాని మీద దొస పెట్టి, దొస మధ్యలో అన్నం ముద్దకు పసుపు, కుంకుమ బొట్టులు పెట్టి రెండు కడ్డీలు ఆ అన్నం ముద్దకు చెక్కి పుజ చేస్తారు..తరువాత ఆ మొత్తం (చల్ల అంటారు) పిల్లలు తీసుకొని వచ్చి గుడి దగ్గర నిల్చోని, మిగతా ఇల్లలోని పిల్లల్ని "చల్లో చల్ల" అని అరుస్తూ పిలుస్తారు..అమ్మయిలు పసుపు నీళ్ళు ఎత్తుకొచ్చి వరుసయ్యే అబ్బాయిలపై చల్లుతారు..అన్ని ఇళ్ళ నుంచి వచ్చిన తరువాత అందరు ఆ చల్లను తీసుకొని వెల్లి చెరువులోని నీళ్ళలో వేస్తారు.. (బావ - బావమరిది అయ్యే వారు - అన్నం ముద్దలు ఒకరిపై ఒకరు విసురు కొంటారు)
- ఫలహారంగ (7:30 am onwards): దోసలు, బెల్లం పాకం, చెట్నీ, అనప గింజల కూర, ఈ మధ్య కాలంలో కోడి కూరతో తిని తరువాత పనులలోకెల్తారు..
- పశు సంపద (కోడేలు, ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, బర్రెలు, దున్నపోతులు మొదలగు) నీళ్ళతో కడిగి, అలంకరిస్తారు (కొమ్ములకు రంగులు వేసి, కొప్పులు పెట్టి, గజ్జేలు కట్టి, రంగు రంగుల తాల్లు మరియు బట్టలు తోడిగి)...వేప, కానుగ మరియు ఆయుర్వెద చెట్ల చెక్కను (Bark) బాగా దంచి పసుసంపదకు తినిపించడం.. !
- (10 am onwards) ఇంకో ప్రక్క, కోడి పందేలు, టెంకాయ పందేలు, జూదం, పొట్టేలు పందేలు, ఎద్దులతో ఆటలు (జల్లి కట్టు)..ఊరు అంతా కలిసి జరుపుకొంటారు..
- ఇక సాయంకాలం (4pm), కొందరు (సాకలి, కొందరు రైతులు) ఊరిలోని అందరి ఇళ్ళలో నుంది బియ్యము, పెసరపప్పు, బెల్లం, నెయ్యి మరియు గుమ్మడి కాయ సేకరించి ఊరికు దగ్గరలోని పండుగ చేసే స్థలములో (కాటం / పసల దేవర) పరమాన్నం తయరు చేస్తారు.. ఇంటి దగ్గర ఆడవారు మాత్రం, నేతిలో చేసిన అత్తిరసాలు చేసి పూజా సామగ్రి తో పండుగ చేసే స్తలానికి(పసల దేవర) చేరుకొంటారు.. ఇక మగవారు, పిల్లలు కలిపి అలంకరించిన పసు-సంపదను తీసుకొని పండుగ చేసే స్తలానికి (పసల దేవర) చెరుకొంటారు.. (~5:45 pm)
- వండిన పరమాన్నం దేవుడికి పెట్టి, పసు సంపదలో చల్లి..అందరు తెచ్చిన అత్తిరాసములు పూజలో పెట్టి , వారు తెచ్చిన టెంకాయలు కొట్టి..చిట్లాకుప్పకు (కట్టెలు, కంపలు వేసిన కుప్ప) అగ్గి పెట్టి.. (6 - 7pm, సూర్యస్తమయం ) డప్పులు కొడుతూ, టపాసులు పేలుస్తూ ఎద్దులను సవారి తీయించి ఇంటికి తీసుకొస్తారు.. దేవుడి దగ్గర చేసిన పరమాన్నం, నేతి అత్తిరాసాలు ప్రసాదంగా అందరు తిని ఇళ్ళు చేరుకొంటారు..అంతటితో సంక్రాంతి పండుగ ముగుస్తుంది.
- మీ వూరులో వేరే విధంగా చేస్తూఉంటే తెలియ చేయగలరు. ⁕
|
చిట్లాకుప్ప
|
|
చల్ల.. |
|
చల్లో చల్ల.. |
Shivaratri (మహా శివరాత్రి): మహా శివరాత్రి, శీతాకాలం చివరలో జరుపుకొనే పండుగ - అంధకారం మరియు అజ్ఞానం తొలగిపోవాలని జరుపుకొనేది. పూర్తిగా ఉపవాసం మరియు జాగరన చేస్తూ, శివనామ స్మరణతో..శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోవడం..అలానే శరీరానికి తగినంత (తగ్గించి) ఆహారాన్ని అలవాటు చేయడం..తరువాత రోజు ఉపవాసం తీర్చుకోవడం, శివాలయ దర్షనముతో పండుగ ముగుస్తుంది..
Sriraama Navami (శ్రీ రామ నవమి)
Ganga Panduga (గంగ పండుగ):
Molakula pournami (మొలకుల పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి / జ్యేష్ట పౌర్ణమి అని కూడా అంటారు) ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ. దీనినే జ్యేష్ట పౌర్ణమి అంటారు. తొలకరి ఆసన్నమవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంటపొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరుపొంగి పొర్లడానికి చేసే పూజ అని కూడా అంటారు.
నేలను బట్టి కూడా పంటలను వేయాలి అప్పుడే రైతులకు అధిక లాభాలు వస్తాయి. ఏ కార్తెలో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే రైతులకు అధిక దిగుబడులు వస్తాయో తెలిస్తే నిజంగా రైతే రాజు అవుతారు. మొలకుల పౌర్నమి పండుగను "రోహిణి కార్తె/మృగశిర కార్తె" సమయములో జరుపుకొంటారు, పల్లె రైతులు. పండుగ పదిరోజుల ముందు మొదలవుతుంది...ఇంటిలో దాచిన విత్తన గింజలు (తొమ్మిదికి మించి) నమూనాగా (sample) తీసుకొని చిన్న మట్టి కుండలలో మట్టి+ఎరువు వేసి విడి..విడిగా కాని లేదా అన్ని కలిపి గాని విత్తుతారు. ప్రతి రోజు నీరు చల్లుతు విత్తనాల పెరుగుదల మరియు నాణ్యత పరిశీలించి తొమ్మిదవ దినం, మొలకుల పౌర్నమి పండుగరోజు ఇంటిలో, గుడిలో, పిత్రుదేవతలకు విత్తనాలతో పెరిగిన మట్టి పాత్ర, పిండి వంటలు మరియు ఫల, పుష్పాలు సమర్పిస్తూ టెంకాయ/కొబ్బరి కాయ కొట్టి పుజా కార్యక్రమాలు చేస్తారు. మంచిగా వచ్చిన విత్తనాలలను తరువాత వచ్చే ఆరుద్ర కార్తె విత్తుతారు భూమిలో..
మొలకుల పౌర్ణమి పండుగ మంచి ఎండా కాలములో వస్తుంది కదా..మా ఊరిలో అయితే, రాత్రి 7 గం. సమయములో అన్ని కుటుంబాల వారు పిత్రు దెవతలకు సమర్పించిన తరువాత ప్రశాంతమైన వాతావరణములో కూర్చోని ఉంటే కొందరు ఆటలు, కొందరు పాటలతో వినోదాన్ని పంచుతూ ఉంటే, కొందరు కొబ్బరి కాయ, బెల్లము, అరటిపండ్లు మరియు బొరుగులు అందరి దగ్గర తీసుకొని, వాటిని అన్ని చిన్న ముక్కలుగా చేసి ఒక పెద్ద పాత్రలో కలిపి అందరికి ప్రసాదంగా పంచి పెడుతారు. అలా పండుగ ముగుస్తుంది..
ఈరోజున భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది. ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి. ఈ పండుగతో రైతులకు పని (పనిముట్లు మరియు విత్తనాలు సమకూర్చుకోవడం), భూమిని దున్నడాలు మొదలవుతాయి..
ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడం. సాంప్రదాయికంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఆ రోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెడుతారు.
పల్లెలలో ఆడవారు అందరు కలిసి ఆడి/పాడి/ఆటలతో జరుపుకొనే పండుగలలో ముఖ్యమైనది.
ఆడవారి ఆటలు: జక్కీకి, కుంటాట, చెమ్మ-చక్క, ఒత్తొత్తి-సురోత్తి, ముట్టాట (చెక్కా-బిల్లా), వెన్నాయిలాట, బారా-కట్టి, అలసంద-రళ్ళాట, పులి-మేక, గుంత-రాళ్ళాట, దాగుడు-మూతలు,
*గులారు-గోల్లు:* అవిసి మరియు అడవి కట్టెలు కాల్చి బొగ్గులు చేసి, వాటిని ధంచి పొడి చేసి, అందులో ఉప్పు మరియు తవుడు వేసి, కలిపి పేడ పూసిన బట్టలో (తిత్తి) పోసి, తీగ లేదా తాడు కట్టి, నిప్పు పెట్టి - రాత్రిలో తిప్పొతూ ఉంటే...రంగు-రంగుల నిప్పులు వయ్యారంగా...చూడ ముచ్చటగా...మాటలలో వర్ణించలేము. (natural crackers of those days)
- వైశాఖ ఫుర్నిమ / మొలకల పౌర్నమి
- Vaisakha Purnima / in telugu -Molakala pournami celebrated as festival, like below:
- 10 days before, people take sample of all seeds (rice, pulses) and apply them in 9 or 11 / more odd # 's , in small pot's./ coconut shells. 9 / 11th day, they - during Vaisakha Purnima day(some), night (8 - 10 pm) they take these small pots & keep them in their preferred temples, places where their elders were cremated.....
- Benefits of the fest: (we should learn)
- - Entire village meets at one place & watch who's seeds grown well..
- - Checking (Pilot) the seed quality, before they apply in field (in Jun '21)
- - Barrow certain seeds from other families who's seeds grown well / healthy.
- - Few teaming activities for men, women will be there... too
.
In other way, summer ending stage too....So, boys who were planying kabaddi & other plays in night (7pm to 10 pm) will slowly stop....& focus on field works. - Prep by Mekala V Reddy 🌱🌴🌱 - 26 May '21
తొలి ఏకాదశి:
• *ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, దేవశయని ఏకాదశి, పేలాల పండుగ* అని కూడా అంటారు.
• ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి (నాలుగు నెలలు)వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. *(శయన ఏకాదశి)*.
• ఏకాదశి నాడు *ఉపవాసం* ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి..*ఆవులను పూజించాలి..* రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, ఇక ఏకాదశి పండుగ రోజు *పేలపిండిని* తినడం కూడా ఎంతో మంచిది. https://www.youtube.com/watch?v=6XgI1LV3NCU!
• *ఏకాదశి అంటే పదకొండు (11)* అని అర్థం, అంటే, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11.
• ఈ రోజు నుంచి *దక్షిణాయనం* ప్రారంభమవుతుంది.
----------------------------------------------------------
Ugaadi (ఉగాది పండుగ),
Ganesha Festival (వినాయక చవితి)
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు. విఘ్నేశ్వరుడిని 21 రకాల పత్రి/ఆకులతో పూజిస్తారు. అవి
వినాయక చవితి నాడు
Dussara/Deepavali (దసరా/దీపావళి):
Nomula Festival (నోముల పండుగ)..
నోముల పండుగ - 2024: 11 నవంబర్ (సోమవారం)
Prep work sharts few days (4 - 6) early with cleaning the house, white wash walls, !
Day before or two:
- Prepare sweets (Attiraasalu / అత్తిరాసాలు) for festival + distribution +
- అత్తిరాసాలు: 1250
- కారాలు (మిక్షర్): 4 kgs
- నేతి అత్తిరాసాలు: 150
- Invite relatives & villagers
Day of the Festival: majority of family members will be on fasting...till evening puja (7pm)
- Prepare food items for the puja & Dinner
- Prepare for Puja: Sugar cane (4 no's), Mango leaves, Tulasi & other...clean & freshly decorate "Jagili" :)
- During Puja - read "Kedaareswara katha" & other festive special activities..
- Post Puja: Serve cooked food, sweets to all invitees & villagers. And all fasting family members break the fasting by eating food/prasad
మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.
★ ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
★ శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
★ అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
★ వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
★ నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
★ వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
★ రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
★ వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
★ పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
★ దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
★ దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
★ కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
★ సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
★ మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
★ హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
శుభోదయం....
సంక్రాతి కి ఇంత మజా వుంటుందా...
మన" పల్లెకు పోదాం " అనే ఈ కార్యక్రమానికి మీరెంతమంది సిద్దంగా వున్నారో,
మీరెవరెవరిని ఆహ్వానించాలో ఇప్పుడే నిర్ణయించుకోండి....లేకుంటే వాహనాలకు రిజర్వేషన్ కష్టం..
నేటి రోజుల్లో యాంత్రిక/రసాయనాలతో బ్రతుకు తప్పడం లేదు కదా... కనీసం ఏడాదికి ఓ మూడు రోజులైనా స్వచ్చమైన ప్రకృతిని / గాలిని అనుభవిద్దాం...
ఈ సంక్రాంతి ప్రత్యేకతలెన్నో---
# మంచి మనుషులు, పలుకరింపులు
# అలకలున్నా పలుకరించే ఉరి వాల్లు
# రోషమున్న కోడిపుంజులు
# వంగరంగు గురుగు పూలు
# చెంగు చెంగుమని ఎగిరే లేగదూడలు,
# అమ్మ చేత వత్తబడిన అత్తిరసాలు,
# సోదరి చేత పోయబడిన దోశలు
# అత్తగారి ఇంట వడలు,
# మామగారు తెచ్చిన పొట్టేలి తునకలు
# దేవళం దగ్గర పోసే చల్ల,
# పిల్లాడు ఎగరేసే గాలిపటాలు
# ఒదిన గారు వండిన పప్పు / వంకాయ పులగూర
# సన్నాయి ఊదుతున్న హరిదాసు
# తలవూపి అబ్బురపరిచే డూడూ బసవన్న
# రంగులద్దుకున్న ఆవు కొమ్ములు
# చలిని తరిమే భోగి మంటలు
# పెళ్లాన్ని బెదిరించలేక ఆవుల్ని బెదిరించే మొగుళ్లు
# మిరియాల ఘాటుతో ఉసుర్లు కొట్టిస్తున్న నాటుకోడి తునకలు
# ఊరి వీధుల్లో తళుకుమంటున్న రంగవల్లి ముగ్గులు
# దుమ్మురేగకుండా చల్లిన పేడ కళ్లాపి
# చీమిడి ముక్కులతో రబ్బరు బుడ్డలు వూపుతున్న చిన్న పిల్లలు
# ఊరును వదలి వెళ్లేటపుడు అమ్మ, నాన్న చెపుతున్న జాగ్రత్తలు,
# బతుకు బండిని ఈడ్చేందుకు బయలుదేరుతుండగా పల్లెని వదలలేక కమ్మే కన్నీళ్లు....
ఇంకా ఇంకా.... ఎన్నెన్నో....
ఈ అనుభూతులు మీరు పొందలేక పోతే మీ జీవితంలో ఈ సంక్రాంతి తో ఆ తీయటి అనుభూతులు .... పొందండి !! J
"పల్లె తల్లి పిలుస్తోంది రండి " (Don’t miss Sankranthi )
స్వీయ అనుభవాలతో , మీ… మేకల వీ రెడ్డి
కొత్త ఏడాది వస్తోంది... ఇప్పటిదాకా జరిగిపోయిందేదో జరిగిపోయింది... ‘‘ఉదయం ఆరింటికే లేస్తాను’’ ‘‘రోజూ వ్యాయామం చేస్తాను’’ ‘‘ధూమపానం వదిలేస్తాను..’’ ఇలా ఎన్నో తీర్మానాలు! దురలవాట్లకు దూరంగా ఉంటానని, మంచి అలవాట్లు చేసుకుంటానని ప్రతిజ్ఞలు... ఇవన్నీ పాటించండి...
*కానీ బలవంతంగా కాదు... ప్రేమతో... నియమంగా కాదు... స్పృహతో*...
*నిజానికి మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటూ ఏమీ ఉండవు. ఏ అలవాటైనా మితిమీరితే బంధించి వేస్తుంది*
----------------------------------------------------------------------------------------------------------
వైశాఖ ఫుర్నిమ / మొలకల పౌర్నమి
Vaisakha Purnima / in telugu -Molakala pournami celebrated as festival, like below:
- 10 days before, people take sample of all seeds (rice, pulses) and apply them in 9 or 11 / more odd # 's , in small pot's./ coconut shells. 9 / 11th day, they - during Vaisakha Purnima day(some), night (8 - 10 pm) they take these small pots & keep them in their preferred temples, places where their elders were cremated.....
Benefits of the fest: (we should learn)
- Entire village meets at one place & watch who's seeds grown well..
- Checking (Pilot) the seed quality, before they apply in field (in Jun '21)
- Barrow certain seeds from other families who's seeds grown well / healthy.
- Few teaming activities for men, women will be there... too
.
In otherway, summer ending stage too....So, boys who were planying kabaddi & other plays in night (7pm to 10 pm) will slowly stop....& focus on field works. - Prep by Mekala V Reddy 🌱🌴🌱 - 26 May '21
సాగు దేవర: (when village Tanks, Canals overflow with good rains - any time of the year)
మన చెరువు మొరవ పారిన సందర్భంగా సాగు దేవర ఈరోజు (14th Dec '21) చెయ్యడం జరిగింది. రెండు పొట్టేళ్లను చెరువు కట్టమీద గంగమ్మ తల్లికి బలి ఇచ్చాము. రాశి ఇంటి వారు పూజా కార్యక్రమాలు ప్రారంభించి నారు . అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి అయినవి.
ఈ కార్యక్రమం సజావుగా పూర్తి కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. ఇట్లు మేకల మోహన రెడ్డి
పెళ్ళి గుండు/రాయి: సుమారు 60 కేజీలు కలిగిన గుండ్రటి రాయి, ప్రతి ఊరిలో ఉండేది. పెళ్ళి కావాల్సిన యువకులు ఆ రాయిని చేతులతో ఎత్తి బుజం మీదుగా వెనక్కి వేయగలిగితే..వాళ్ళు పెళ్ళికి సరిపడ శక్తి ఉన్నవాళ్ళుగా..వర్ణించేవాళ్ళు కొన్ని దశాబ్దాలకు ముందు.. - మీరు విన్నారా !? చూశారా !? - మేకల వి రెడ్డి.
[Boys in late teenage age, in our villages gives a try to lift ~60 kg round stone with hands & throw over soldiers to get 'eligible' certificate for marriage from elders few decades back, i.e. before 2K]
శుభోదయం....
సంక్రాతి కి ఇంత మజా వుంటుందా...
మన" పల్లెకు పోదాం " అనే ఈ కార్యక్రమానికి మీరెంతమంది సిద్దంగా వున్నారో,
మీరెవరెవరిని ఆహ్వానించాలో ఇప్పుడే నిర్ణయించుకోండి....లేకుంటే వాహనాలకు రిజర్వేషన్ కష్టం..
నేటి రోజుల్లో యాంత్రిక/రసాయనాలతో బ్రతుకు తప్పడం లేదు కదా... కనీసం ఏడాదికి ఓ మూడు రోజులైనా స్వచ్చమైన ప్రకృతిని / గాలిని అనుభవిద్దాం...
ఈ సంక్రాంతి ప్రత్యేకతలెన్నో---
# మంచి మనుషులు, పలుకరింపులు
# అలకలున్నా పలుకరించే ఉరి వాల్లు
# రోషమున్న కోడిపుంజులు
# వంగరంగు గురుగు పూలు
# చెంగు చెంగుమని ఎగిరే లేగదూడలు,
# అమ్మ చేత వత్తబడిన అత్తిరసాలు,
# సోదరి చేత పోయబడిన దోశలు
# అత్తగారి ఇంట వడలు,
# మామగారు తెచ్చిన పొట్టేలి తునకలు
# దేవళం దగ్గర పోసే చల్ల,
# పిల్లాడు ఎగరేసే గాలిపటాలు
# ఒదిన గారు వండిన పప్పు / వంకాయ పులగూర
# సన్నాయి ఊదుతున్న హరిదాసు
# తలవూపి అబ్బురపరిచే డూడూ బసవన్న
# రంగులద్దుకున్న ఆవు కొమ్ములు
# చలిని తరిమే భోగి మంటలు
# పెళ్లాన్ని బెదిరించలేక ఆవుల్ని బెదిరించే మొగుళ్లు
# మిరియాల ఘాటుతో ఉసుర్లు కొట్టిస్తున్న నాటుకోడి తునకలు
# ఊరి వీధుల్లో తళుకుమంటున్న రంగవల్లి ముగ్గులు
# దుమ్మురేగకుండా చల్లిన పేడ కళ్లాపి
# చీమిడి ముక్కులతో రబ్బరు బుడ్డలు వూపుతున్న చిన్న పిల్లలు
# ఊరును వదలి వెళ్లేటపుడు అమ్మ, నాన్న చెపుతున్న జాగ్రత్తలు,
# బతుకు బండిని ఈడ్చేందుకు బయలుదేరుతుండగా పల్లెని వదలలేక కమ్మే కన్నీళ్లు....
ఇంకా ఇంకా.... ఎన్నెన్నో....
ఈ అనుభూతులు మీరు పొందలేక పోతే మీ జీవితంలో ఈ సంక్రాంతి తో ఆ తీయటి అనుభూతులు .... పొందండి !! J
"పల్లె తల్లి పిలుస్తోంది రండి " (Don’t miss Sankranthi )
స్వీయ అనుభవాలతో , మీ… మేకల వీ రెడ్డి
కొత్త ఏడాది వస్తోంది... ఇప్పటిదాకా జరిగిపోయిందేదో జరిగిపోయింది... ‘‘ఉదయం ఆరింటికే లేస్తాను’’ ‘‘రోజూ వ్యాయామం చేస్తాను’’ ‘‘ధూమపానం వదిలేస్తాను..’’ ఇలా ఎన్నో తీర్మానాలు! దురలవాట్లకు దూరంగా ఉంటానని, మంచి అలవాట్లు చేసుకుంటానని ప్రతిజ్ఞలు... ఇవన్నీ పాటించండి...
*కానీ బలవంతంగా కాదు... ప్రేమతో... నియమంగా కాదు... స్పృహతో*...
*నిజానికి మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటూ ఏమీ ఉండవు. ఏ అలవాటైనా మితిమీరితే బంధించి వేస్తుంది*
----------------------------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment