Sunday, 3 May 2020

Village Life

Theme: Village Life is wonderful & is the "way of Life" for human and should experience instead of words :)  [ పల్లె జీవితం: ప్రకృతి ఒడిలో, అనందకరమైన పల్లె జీవితం, తరతరాల జీవనవిధానం!! మాటల్లో చెప్పలేని  మధురాను జ్ణాపకాలు..... ]
Write-up: Mekala V Reddy
Pictures: From Net or - Muralidhar Alagar (my ex. Team Member)

అడుసులో మడక దున్నడం అంత సులభమేమి కాదు సుమీ !! అదో కళ, అదో ప్రవీణ్యం. మంచి కాడేద్దులు, మడక ఉంటే అదో ఆనందం కూడా.....

 "పల్లె పాటలు ఎప్పుడు మనసుకు హత్తుకొంటాయి..కాని పల్లెలలో కొద్దిగా మార్పు వచ్చిందనిపిస్తుంది..ఏమంటారు !?" - Mekala V Reddy

భాషకన్నా భావం గొప్పది. భావాన్ని కళ్ళముందు లిఖిత పూర్వకంగా ఆవిష్కరింపజేసే వ్రాత గొప్పది. వ్రాసిన వ్రాతలు పుస్తకం నుంచి మనిషి మస్తకాలకి నేరుగా చేర్చే నేపథ్యంలో గాత్ర రూపం గొప్పది. కర్మేంద్రియాలు... జ్జానేంద్రియాలూ.... ఒకేసారి ఏక కాలంలో ప్రతిస్పందించే ప్రక్రియే ఈ...గీతాలాపన !! 😊 - from Net

  1. జొన్నచేలో నువ్ నిల్చొంటే..ఒయ్ రెడ్డి పాట - teasing song: girl & boy
  2. అందాల మాఊరి అక్కా .. సాంగ్ | సమ్మక్క సారక్క
  3. నా కొడుకా మా నందిరెడ్డి (Tragic song )  
పల్లె జీవితం తరతరాల జీవనవిధానం...!!
మన పల్లెలు నేర్పిన జీవిత పాఠాలు..🥰

😊పొలం గట్లపై నడిపించి, తడబడకుండా  నిలదొక్కుకోవటం  నేర్పింది.
👉 అకాల వర్షాలకు, గాలి దుమారాలకు పంటలు  పాడై పొతే, నష్టాలకు నిలదొక్కుకునే స్థైర్యం నేర్పింది.
🙏వాగు పక్కన నీటి  చెలిమలు తీయించి, శోధించే తత్వం నేర్పింది.
👉సీతాఫలాల కోసం చెట్ల చుట్టూ తిరిగించి, అన్వేషణ నేర్పింది.
👏తుమ్మ ముల్లు, పల్లేరు గాయాల గుచ్ఛులతో, జీవితం పూలపాన్పు కాదని నేర్పింది.
👏వేరుశనగ కాయ కొట్టించి, సోలెడు పల్లీలు తీయించి, ఐదు పైసల సంపాదన నేర్పింది.
🐂ఆవులతో, 🐃గేదెలతో, 🐓కోళ్లతో స్నేహం🐔 చేయించి, ప్రాణికోటి పై బాధ్యత పెంచింది,  ప్రేమతత్వాన్ని నేర్పింది.
👏రాగడి  మట్టితో బండి గిర్రలు చేయించి, మొక్కజొన్న సొప్ప బండ్లకు తొడిగించి, పనితనం నేర్పింది.
👉వేలాడే పిచుక గూళ్ళు, చెట్ల కొమ్మల పంగల మధ్య కొంగ గూళ్ళు చూపించి బొమ్మరిల్లు కట్టించి, చిన్నప్పుడే సివిల్ ఇంజనీరింగ్ నేర్పింది.🕊️
🙋 సంక్రాంతి  / బతుకమ్మ తంగేడు గునుగు పూల కోసం, తెల్లవారుతూనే  పొలం బాట పట్టించి, ఇంటి ఆడబిడ్డల బాధ్యతను నేర్పింది.
🤗పొలం పనుల్లో చిన్న చిన్న దెబ్బలు తగిలితే, నల్లాలం  ఆకు పసరు పోయించి, చిన్న చిన్న ఇంటి వైద్యం చిట్కాలు నేర్పింది.
👌చెట్టుమీద మామిడికాయ గురిచూసి కొట్టడం, లక్ష్యాన్ని ఛేదించడం నేర్పింది.
 👉నిండు బిందెను నెత్తి మీద పెట్టి, నీళ్లు మోయించి,జివితమంటే బరువు కాదు బాధ్యత అని నేర్పింది.
👉బావి నుండి బొక్కెనతో నీళ్లు తోడించి, బాలన్స్ గా బరువు లాగటం నేర్పింది.
😘ఇంటి ముంగిటకు  అతిథి దేవతలు హరిదాసులు గంగిరెద్దులను రప్పించి, ఉన్న దాంట్లో కొంత  పంచుకునే గుణం నేర్పింది,
👉ఇసుకలో పిట్ట గూళ్ళు కట్టించి, ఒక ఇంటి వాడివి కావాలి అనే స్పృహను నింపింది.
👏పచ్చపచ్చని నిగనిగలాడే మోదుగాకుల  విస్తరిలో, అన్నం అంచులు దాటి కింద పడిపోకుండా తినే
ఒద్దికను నేర్పింది.
😋మోదుగాకులు తెంపించి, ఎండబెట్టించి, కట్టలు కట్టించి, విస్తరాకులు కుట్టించి, అతిథులకు ఎంగిలి కాని పాత్రల్లో భోజనం వడ్డించడం నేర్పింది.
😊ఉన్న ఒక్క పిప్పర్మెంట్ ను, అంగీ బట్ట వేసి, కొరికి ముక్కలు చేసి, కాకి ఎంగిలి పేరుతొ దోస్తులతో పంచుకోవటం నేర్పింది.
👉ముళ్ళు గుచ్చుకోకుండా,  ఒక్కటొక్కటిగా రేగ్గాయలు తెంపే ఓర్పును నేర్పింది.
🤗ఎండా కాలంలో తుమ్మ చెట్ల బంక సేకరణ, స్వయం సంపాదన ధోరణి నేర్పింది.
💕గోరింటాకు ని తెంపించి, దంచించి, చేతులకు అద్దించి, వికసించడం చూపించింది.
🤗వాయిలి బరిగెలతో, సుతిలి దారంతో విల్లును చేయించి, వస్తు తయారీ మెళకువలు నేర్పింది.
😘అత్తా, మామా, అన్నా  వదినా,  అమ్మమ్మా, నాయినమ్మా, తాతయ్యా వరుసలతో, ఊరు ఊరంతా ఒక కుటుంబమనే ఆత్మీయత నేర్పింది.
🙏ధైర్యంగా  బ్రతికే  పాఠాలను నేర్పిన మా ఊరుకు / పల్లెకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం.
😘నేను గ్రామం లో (పల్లెలో) పుట్టి పెరిగాను అని చెప్పటానికి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా..
- ఆలోచించండి, ఆచరించండి: పిల్లలను పల్లెలలో కొద్దిరోజులు ఉంచడానికి.. - Mekala V Reddy (09 Feb '22)
----------------------------------------***----------------------------------------

బాతుల బెక, బెకలతో దారి అంతా ఆక్రమించి, వడి వడిగా వెల్తున్న వాటిని చూస్తూన్నంతలో ....ఎంతో క్రమపద్దతిలో మనకు దారి ఇచ్చిన విదానం అబ్బురపరుస్తొంది...కదా !!

ఆడరా బొంగరం....

 
  
మూగ జీవం (ఆవు) కూడా మనిషి బాధను అర్థం చేసుకోగలదు...... బాధను తీర్చలేకపోయినా!!










 వరి నాట్లు ఓ పండుగ వాతావరణం మరియు కొలహలం: నారు తీయడం, కట్టలు కట్టడం, అడుసు మడిలో వేయడం....ఒక పక్క అయితే...
మడి దున్నకాలు ఓ పక్క, మడి నాటుతూ పాటలు పాడుతున్న పడుచులు ఒక వైపు ....





 వర్షం కురిసిన వేళ...... !! పోలం పనులు ముగించుకొని వడి వడిగా ఇంటివైపు అడుగులేస్తున్న ఆడపదుచు, ఆవు, లేగదూడలు....

----------------------------------------***----------------------------------------
యువతకి ఇవి కూడా పల్లె జీవితములో ఒక భాగము..
- గోడ దూకడము
- పంపు సెట్టు..
- బోరు పంపు..
- గడ్డి వాములు..
- చెరకు తోటలు..
- మిరప/వంగ తోటలు..
గుర్తుకొస్తున్నాయి.. : పచ్చని పల్లెలలొ పెరిగిన (చిన్నప్పటి ) ఆ రోజులు...ఎంతో బావున్నాయి అని..కొన్ని విశేషాలు ఇక్కడ పంచుకొంటున్నాము..మీరు కూడా ఆలోచించండి & మధురస్మ్రుతులను మన అనుకొనే వారి తో పంచుకొండి. :)
  
గుర్తుకొస్తున్నాయి: Leonotis nepetifolia (మహాబీర) చిన్నప్పుడు వీటిని చక్రాలుగా ఆడుకొన్న రోజులు - Mekala V Reddy 15 Mar '23 🔰
  • ప్రతిరోజు పరగడుపున నీటిలో నానబెట్టిన మహాబీర విత్తనాలను తాగితే ఒంట్లో కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. 
  • మోకాళ్ళ నొప్పులను నడుము నొప్పిని తగ్గించే మహాబీర విత్తనాల
----------------------------------------***----------------------------------------
గుర్తుకొస్తున్నాయి: bee hive-తేనే పుట్ట: చిన్నప్పుడు తేని పుట్టను (చెట్లలో, గోడలకు, పుట్టలలొ) చూసి దాన్ని తీసి, అంతా పంచుకొని..తేని అంటిన చేతులు నాక్కుంటు ఆనందించిన ఆ రోజులు... - Mekala V Reddy 18 Mar '23 🔰
----------------------------------------***----------------------------------------

గుర్తుకొస్తున్నాయి: Pongame oiltree flower (కానుగచెట్టు పూత): చిన్నప్పుడు కానుగచెట్టు పూతను తోసి పొలాలకు వేసే వాళ్ళం ఉగాదికి అటో, ఇటో రోజులలో !! ఆ రోజులు...ఎంతో బావున్నాయి అని.. - Mekala V Reddy  Mar '23 🔰

----------------------------------------***----------------------------------------

*బలగం" సినిమా..!* "మూఢనమ్మకమే" గానీ దాని వెనుక ఉన్న మానవ సంబంధాల విలువలను జోడించి చూపించారు.. 😊 [ *Bhalagam* is a Village oriented movie to show Family - Traditions - Responsibilities - values relations !! ]

  • ఓ *పెద్దాయన* తన అంతిమ దినాలలో ఎంత హుషారుగా నవ్వుతూ ఆటపట్టిస్తూ ఆరోగ్యంగా వుంటాడో, అతనికి ఆ మహిళల సమాధానాలు ఎంత చమత్కారంగా వుంటాయో.... సహజంగా చూపించారు..🥰
  • ఒక *యువకుడు* డబ్బు కోసం సంబంధాలను ఎలా ఏమార్చి, మార్చుకుంటాడో చూపించాడు..💲
  • ఇంటికి / ఓ *పెద్దకొడుకు* తన చెల్లెలిని ఎంత ప్రేమగా చూసుకుంటాడో తమ్ముడి చేతికి వాతపెట్టిన సంగతి తెలిస్తే అర్థమౌతుంది..👭
  • ఓ *ఇంటి అల్లుడు* తనకి దక్కవలసిన మర్యాద దక్కకపోతే ఎంత రోషానికి గురై విలవిలలాడిపోతాడో అర్థమౌతుంది..😇
  • ఓ *తమ్ముడు* ఆదాయం లేని స్థితిలో తన భార్య చేతిలో బంధీగా మారిన వైనం అర్థమౌతుందీ..👨🏻
  • ఓ భార్యను తన పుట్టింటికి పంపకపోతే ఎలా కృంగిపోతుందో.. రేపు తన కూతురూ ఏదో ఒకరోజు ఈ తండ్రికి దూరమైతే తట్టుకోలడా? అని మార్పుని తెప్పించే సీన్ అద్భుతం..👨‍👩‍👧
  • కాకి పిండం ముట్టకపోతే ఆ కుటుంబంలోని వ్యక్తుల గతంలోని "సంకుచిత భావాలతో గొడవలూ, చీదరింపులూ, పట్టింపులేని తనం, అవకాశవాదం, మొరటుదనం, వెర్రితనం" లాంటి నెగటివ్ తీరు కారణం అనీ, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ *మంచిగా నడుచుకోవాలని చూపించారు* .
  • చివరలోని పాట.. అది పాట కాదు.. "మానవ సంబంధాల తీరు,, ఒక మనిషిపై మరో మనిషియొక్క ప్రేమ, బాధ్యత, ఉమ్మడి కుటుంబం యొక్క బలం.. ఓ తండ్రికి తన బిడ్డలపై ఉన్న ముందు చూపు" లాంటి భిన్న ఆవేశాలను పాటలో వింటుంటే ప్రతి ఒక్కరికీ కంటనీరు ఆగదేమో..(వారి జీవితములోని సంఘటనలు గుర్థుకువస్తూ..)!!😢
  • ఇక ఆ ఇంటి *ఆడపడుచు*,, భర్తకూ, అన్నకూ మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ నలుగుతూ ముఖంలో బాధను వ్యక్తం చేస్తుంటే ... ఆమె హావ భావాలే మన ఇంటిలోని సోదరి కంటపెడుతూంటే తట్టుకోగలమా" అన్నట్లు అనిపిస్తుంది.. 💃
  • స్నేహితులు, ఊరివాళ్ళు వారి భాద్యతలు కళ్ళకు కట్టినట్టు చూపించారు..👥
  • ఈ సినిమా, ఉమ్మడి కుటుంబంలోని అంతరాలను తొలగించుకునేందుకు ఒక *చక్కటి పాఠం* ఇది.. 😊

ఇలా ఒక సన్నివేశం (సీన్) కాదూ .. ప్రతి ఫ్రేమ్ లోనూ తనదైన ముద్ర వేసి విడుదల (రిలీజ్) చేశారు , దర్షకుడు వేణు, నిర్మాత దిల్ రాజు మరియు వారి పిల్లలు 👏

(ఇది నా అభిప్రాయం మాత్రమే) - _మేకల వీ. రెడ్డి_ (29 Mar '23)

----------------------------------------***----------------------------------------

మంచి సందేశం కాకి జీవన విధానం నుంచి మనిషి నేర్చుకోవాల్సినవి..

"బలగం" సినిమా లో  "కాకి" అనే ఒక పక్షిని మన  ఆచారంలో భాగంగా చూపించారు... అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది... ఎందుకంటే కాకి - "కాలజ్ఞాని" అంటారు"..!

కాకి జీవన విధానం: 

  • వేకువ జామునే "(బ్రహ్మ ముహూర్తంలో)" మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి.
  • "కావు కావు" అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు... ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ "కావు కావు" అని  అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి.
  • ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న "అన్ని కాకులకు" సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి  ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి.
  • శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి "సంఘటితంగా పోరాటం" చేపట్టేవి కాకులు.
  • ఆడ కాకి - మగ కాకి కలవడం కూడా 'పరుల కంట' పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి, అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం.
  • ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోధనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే...
  • సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే...
  • అంతేకాదు సూర్యాస్తమయం తరువాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా...!!
  • కాకులు లేని ప్రదేశం లేదు ఈ భువిపై కాకి పళ్ళు తిని మరో చోట విసర్జన చేస్తే అక్కడ ఆ బీజం పడి మొలకెత్తి మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి... అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవడంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే అందుకే  "కాకులు దూరని కారడవి" అంటారు.
  • కాకులు అరుస్తోంటే..ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు.
  • అంతేకాదు పకృతి వైపరీత్యాలు వచ్చే ముందు (భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు) కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి.
  • సూర్య గ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక  స్నానమాచరించి బయట ఎగురుతాయి.  అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు.
  • దానధర్మాలు ఆచరించని వారిని ఎంగిలి చేత్తో కాకిని తోలని వారిగా ఉదహరిస్తారు.
  • భోజనం చేసే ముందు మొదటి ముద్ద బయట గోడపై పెట్టి కాకుల్ని పిలిచేవారు పెద్దలు.
  • మానవ జీవన పరిణామంలో కొన్ని తరాలను గుర్తు పెట్టుకునే సాక్షీభూతంగా ఉండే పక్షి కాకి.
  • ఎక్కువ కాలం జీవిస్తుంది కనుక కాకి కలకాలం జీవించడం శాస్త్రంలో కూడా విశదీకరించారు.!
  • కూజాలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి తరువాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా సంతరించుకుంది కాకి...!!
  • భారతీయుల సనాతన ధర్మం - విశిష్టత, ఆవశ్యకత నేటి జనం ఆచరించాల్సినవే.  సంఘజీవనం.., సేవాతత్పరత.., మంచి స్నేహభావాలతో., ఈర్ష్యా ద్వేషాలు లేకుండా., కలసి మెలసి అన్యోన్యంగా., అసమానతలకు అతీతమైన ప్రేమానురాగాలతో., నైతిక విలువలు కలిగి కాకిలా కలకాలం జీవిద్దాము. 

కాకి జీవనంలో ఇంత  తాత్వికత, ఇంత లోతైన అర్థం ఉందా!!!!! అనిపించింది. సత్యమేవ - జయతే 🙏

----------------------------------------***----------------------------------------


No comments:

Post a Comment

Kondareddygaripalli

కొండా రెడ్డి గారి పల్లి, పెద్దగొట్టిగల్లు  Native Place: where every stone & Tree have a story to tell.. నా ఊరు పల్లెటూరు ... ప్రకృత...