Sunday, 20 February 2022

Indian villages

Thinking about our native village ?.....naturally flashback takes to "sweet memories" & childhood days :) spent at villages. This blog covers the South Indian village views & activities via photo's.....which reminds....village memories !!
పుట్టి పెరిగిన ఊరినినడిచి వచ్చిన బాటనుమరవకండి..... అంటే దయచేసి మన ములాల్ని జ్ఞాపకము పెట్టుకోండి..!!
నా ఊరు పల్లెటూరు ...ప్రకృతి అందాల పల్లెటూరు ..నే తిరిగిన వీధులు ...నే నెరిగిన మనుషులు ..\నే నెక్కిన చెట్లు -ఇళ్ల మెట్లు ,దిగిన కాలువ గట్లు , ఆడిన అల్లి చెరువు గట్లు , పరుగులెత్తిన ,పడిలేచిన పొలం గట్లు, నేలను దున్నే ఎడ్లు ,-నే తిన్న వడ్లు,మా గురువులు ,మా పుస్తకాల బరువులు, మా బడి ,గంటల గుడి . మొత్తం నా బాల్యం సాక్షిగా......నా ఊరు పల్లెటూరు....నా ఊరు పల్లెటూరని రొమ్ము విరుస్తాను 
Village Days: During the 70's and 80's all my village's kids were spending 70% of time outdoors in holidays.Normally all of them used to gather by 7 o'clock in the morning at fields. We used to climb tree's to eat fruits like mango,papaya,custard apple,berries,etc.All these fruits were eaten after brushing teeth with neem stick. Used to return home for Brunch / lunch !! Otherwise have brunch around 9:30 & go outside village to play games like marbles, jilla kodi(in Telugu), ball games ,etc. Sometimes we go for birds or squirrel hunting with interested folks. After catching the prey, used to setup a barbeque  cook & eat them. Swimming was a common entertainment during summer holidays(march to may).After all the activities of the day, dinner was around 7:00 pm. Again used to play night time games (Kabaddi in summer time)  And then go to bed (sleep).

Memories of my Childhood: I had my Elementary schooling in a near by village which was 1 km away from home. On the way there was a river without a bridge. So, we used to cross 1- 2 feet deep river canal to reach school & back home. For lunch, school authorities served govt provided food called - Uppindi (close to Upma) which was hygienic &tasty. There were no books until 4th standard. Only slate was used to write, using chalk piece (balapam). While returning to village, we used to climb mango trees.....run & catch in trees (Koothikommachi) & pluck & eat Guava, seemachinta kayalu from trees.
In summer, school was there for half day only. Rest of the day was spent in swimming (rivers, well, lake), then catching birds / squirrels and eating them after barbecue....We also used to play hopscotch (jumping on one leg) and games with small rocks, marbles or seeds. In late evenings, we used to play kabaddi in fields and venneykuppalu (making small units of sand / mud). 

Near by town was 5 kms away. For shopping & movies we had to go there. Generally, we used to go for 2nd shows (~8:30 pm) as no one objected as studies & field works were over by that time. Normally, all theaters in my area used to play 5 - 6 audio songs before starting of the movie.....and the first song was always 'Gana Gana Sundara...." from BhaktaTukaram and last song was always instrumental music which indicated that movie was about to start in few min's. These songs could be heard from kilometers away....and based on the song, we used to run or walk fast to reach theater on-time.

Normally, our focus was always to play with kids & support parents on field activities. Occasionally we got entertainment programs at village, like Record Dance, Drama, Harikatha, Burrakatha, Puppetshow(Tholubhommalata).

After 5th standard, joined 6th standard at near by town which was nearly 5 kms away. We used to cover the distance by foot only, no chappals / shoes. Those days, a pair of chappals costed ~Rs. 10/- which was difficult to afford. So, some people used to buy one pair and used only for functions or while going to relative's home. Normally, school dress code was white shirt & khaki shorts.
Many school kids would have 2 - 3 pairs of school uniforms and 1 - 2 sets of regular dresses - (~1980's time frame)

Some of the Believes:
  • Right side is considered as auspicious
  • If Crow is making noise around House, Relatives will come !!
  • If Gecko makes sound while telling / thinking , then it's true (whatever you say / think) i!!
  • If Dogs cries during night continuously, Some one will die in the village, i!!
  • While leaving out of home for some work, if cat / mala vadu / snake comes opposite, the work may not be successful. 
  • Many people believe : numerology, Vaastu ; Houses construction is preferred direction is East, and then North.
  • Number 3 is considered as an inauspicious number. Traveling by three persons together is avoided. Even 13 is  inauspicious number.
Some of the entertainment cum cultural activities @ Villages: visit village games blog
Village Girl ....:)
              
Padddi fields... (adutu padutu vari natutunna karmikulu!!! )
Padddi fields...


Groundnut crop...Oct /Nov time frame
(Pandina Verusanaga panta nu yedla bandi medi intiki testunna drushyam!!!!! )

Oil (groundnut etc) extracting legacy model

Old days Grinder ....tasty masala curries
[ Raathimeeda masala tayaru chestunna mahila....... ]


Village Borewell
Crossing river / canals with luggage :)
[Yerlu, vagulu, Vankalu datutunna drushyam!!!!  ]
wonderful view.....during crops 
common view ....of collecting money & pulses
[Potta kuti koraku sangitam vayistunna drushyam ]
GroundNut field ...cleaning gross
Nagali toti polam dunnutunna Raitu bidda....]
   
SugarCane fields, refer more
[ Chuda chakkani cheraku polalu..]



Yepuga yedigina Sajja Polalu (Millet)

Ragi Field






Jonnalu

Mango plant






Taking milk from Cow - Jersy
Temple in Village - Nelamalleswaraswami Temple

Facilitating Teacher 

SugarCane fields...

Fertilizers spraying @ SugarCane field

Cutting SugarCane  

Spraying in Paddi Fields

Working in Paddi fields
fertilizing ...Paddi field

Bathing @ River

Typical Village House

Bhali for Gangamma / Gurivi Devera

Village kids playing...

Village Temple..

Village Cow sheds...
Village Gathering during (Ganga) Jathara's

Village Gathering during (Ganga) Jathara's
Firing Crackers....in a Village

Firing Crackers....in a Village

Firing Crackers....in a Village Festivals

Firing Crackers....in a Village Festivals

Mutton cutting....in a Village :)

Mutton cutting as group....in a Village :)

House....in a Village

Goats ....going to hills
Sun rise where lake & hills 

Village people taking Kavadi ..!!
Village people taking Kavadi ..!!

Village Storage system: Bhanalu + Kundalu
Village Storage system: Bhanalu + Kundalu

Private School advertisement :) 

Village Grinder : IsuruRaayi !!
Village Grinder : IsuruRaayi !!
Kavadi ... to Subramanya temples :)



Kavadi ... to Subramanya temples :)

Kavadi ... to Subramanya temples :)
















My Village Tank (water lake)
Kids on SriRama Navami celebrations

Jangam Devara ?
 
Kids on SriRama Navami celebrations
Bamboo's used as ladder to climb plum tree's

clay making...
Drinking water from well
Dynomo- for Bicycle lighting 

Golilu - 

Pulla Ice - Summer time

Alasanda ralla ata

Peppermint cum play item

play with these Eee's-Zeerangi

Natural mixer 

Peppermints + chocolates


Bhongaram - 

Play with old Bicycle Tyres


Mobile Lanther - for lighting 

Kur-kure

Skipping as Game, friendship co-ordination :)

Cycling big Bicycle

Rollers with Tati munjalu & skick

Goli shoda - Shoda+Lemon+masala : Great juice in Summer
Natural Grinder 

Chick's ...

Paddi fields...
Kids Playing @ Sand

Festival celebrations @ night
Cock fighting at Villages
 

Swimming experiments :)



Swim - boys & other :)


swimming , washing ....in river :)
Gold ornaments place

Kothi-Kommachi

mobile shop

Puli-Meka game 

Green fields








Lanthor

Kid playing with Squirrel 

HoneyBee's




Tholubhmmalata 

Break-fast in Badam leaf


ThalaPatra's - (old books)



  


Copper books (olden days)
















Rumour spreads very quick across :)
Lanthors
Grocery bill
      



 

   


  




CheemaChintakayalu

 





























ఆ రోజులే బాగున్నాయ్ !  🤗----------🤗----------
👌😜
  • టెన్షన్లు....ఒత్తిళ్లు... డబ్బు సంపాదన...అతిగా ఆలోచనలు లేకుండా...ఉన్నంతలో కుటుంబమంతా కలసి... ఆనందంగా గడిపిన . ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
  • ఆదివారం ఆటలాడుతూ... అన్నాన్ని మరచిన ఆ రోజులు బాగున్నాయ్..!! 🤗
  • మినరల్ వాటర్ గోల లేకుండా...కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర... నీళ్లు తాగిన...ఆ రోజులు బాగున్నాయ్..!! 
  • ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్లకోసం..ఎర్రని ఎండను సైతం లెక్కచేయని...ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
  • వందలకొద్దీ చానెళ్లు లేకున్నా...ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి... ఆదివారం సినిమా కోసం వారమంతా... ఎదురు చూసిన  ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
  • సెలవుల్లో అమ్మమ్మ.. నానమ్మల (or aunty's) ఊళ్లకు వెళ్లి... ఇంటికి రావాలనే ఆలోచన లేని...ఆ రోజులు బాగున్నాయ్..!! 
  • ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో...కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన  ఆ రోజులు బాగున్నాయ్...!! 👌😜
  • మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా...బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ... చాక్లెట్లు పంచిన  ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
  • మటన్ బిర్యానీ.. చికిన్ బిర్యానీ లేకున్నా... ఎండాకాలం వచ్చిందంటే మామిడి కాయ పచ్చడితో...అందరం కలసి కడుపునిండా అన్నం తిన్న... ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
  • ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా... పరుసు నిండా డబ్బులున్నా...కొట్టుకు పంపితే ...మిగిలిన చిల్లర కాజేసిన ఆ రోజులే బాగున్నాయ్..!! 👌😜
  • సెల్లు నిండా గేములున్నా...బ్యాట్ మార్చుకుంటూ ఒకే బ్యాట్ తో క్రికెట్టాడిన..  ఆ రోజులే బాగున్నాయ్...!! 👌😜
  • ఇప్పుడు బీరువా నిండా జీన్సు ప్యాంట్లున్నా... రెండు నిక్కర్లతో బడికెళ్లిన... ఆ రోజులే బాగున్నాయ్..!! 👌😜
  • ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా... .ఐదు పైసల ఆశా చాక్లెట్ తిన్న... ఆ రోజులే బాగున్నాయ్...!! 👌😜
  • చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో..పిల్లలం కొట్టుకున్నా పెద్దలంతా కలసివుండే ఆ రోజులే బాగున్నాయ్..! ! 👌😜
  • ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా...నాన్న కొనుక్కొచ్చే ...చిరుతిళ్ళ కోసం ఎదురు చూసిన...ఆ రోజులే బాగున్నాయ్..!!👌😜
  • ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లు చల్లగా నోట్లో నానుతున్నా...అమ్మ చీరకొంగు పైసలతో పుల్ల ఐసు కొనితిన్న...ఆ రోజులు ఎంతో బాగున్నాయ్..!! 👌😜
  • పొద్దుపోయేదాకా చేలో పని చేసుకొచ్చి...ఎలాంటి చీకూచింత లేకుండా.. ఎండాకాలంలో ఆకాశంలోని చందమామను చూస్తూ నిదురించిన... ఆ రోజులు బాగున్నాయ్..!! 👌😜
ఆ రోజులు బాగున్నాయ్...🤗 ఆ రోజులు ఎంతో బాగున్నాయ్...👌😜

ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
  • అమ్మ, నాన్న,.... అక్క బావ...చెల్లి మర్ది.... అన్న వదిన.... తమ్ముడు మర్దలు.... 
  • మేనత్త మేనమామ.... పిన్ని బాబాయ్..... పెద్దమ్మ పెదనాన్న.... తాతయ్య అమ్మమ్మ.... 
  • తాతయ్య నానమ్మ..... ఒదిన, మరదలు....బావ బామ్మర్ధి.....ఇంకా.... ముత్తాత తాతమ్మ....
  • ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
  • మమ్మి డాడి..... ఆంటీ అంకుల్ ఇవి రెండు తెలిస్తే చాలు....ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం.... ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం..... వాట్సాప్ లో చాటింగ్....ఐ ఎం ఓ లో విజిటింగ్....స్కైప్ లో వీడియో కాలింగ్....అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాని తీసుకొని పోవడం..... ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్య అమ్మ సస్తే తప్ప.... కనీసం దాయాదులు పోయినా....దగ్గరోడు సచ్చినా....దయలేని దుస్థితి ....చూడలేని పరిస్థితి ....ఇంకెక్కడి బందాలు....ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
  • బందాలు పెరగాలి....అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
  • కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....అది మనింటినుండే ప్రారంభం కావాలి....
  • కలసి బోజనం చేసి.... కలసి ముచ్చటించడం నేర్పాలి....ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....🌹👌😜

Am ready: http://mekalafamilies.blogspot.in , Are you Ready !? 

నేను చిన్నతనం లో...... (take a minute...relax....remind / rewind childhood ... 👫 ) చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి'అనేవాడిని. 4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు. భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !! నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని . కారులో (Bus) వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం. ఎలక్ట్రికల్ Switch ని ఆన్/ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం. రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం . పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమనని భయపడడం. ఫ్రిడ్జ్ తలుపు నెమ్మది గా మూస్తూ లోపల లైట్ వెలుగు ఎంతవరకు ఆరకుండా ఉంటుందో చూసే ప్రయత్నం. మీకు గుర్తుందా ! చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలం, పెరిగి పెద్దయిన తరువాత,చిన్నతనం ఎంత బావుండేది అని భాధ!! బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే మీరు ఈ మెసేజ్ చదువు తున్నపుడు తప్పనిసరిగా మీ మోము పై చిరునవ్వు విరిసి ఉంటుంది. దేవుడు వరం ఇస్తే మరల ఒకసారి నన్ను న బాల్యం లోకి పంపు అని కోరుకుంటాను. school జీవితం !! కేరింతలు కొట్టే స్నేహ సమూహం !! రంగు రంగుల (even khaki & white) యూనిఫామ్ !! చిన్న చిన్న ఫైటింగ్ లు !! గ్రూప్ ఫోటోలు !! combined స్టడీ లు !! ఎప్పటికి తరగని PT క్లాసులు!! గణతంత్ర దినోత్సవ దినం!! ఎడతెగని వాదోపవాదాలు !! ఎన్నో రుచుల లంచ్ బాక్స్లు !! మరిచిపోలేని మార్కుల కాగితాలు !! భయపెట్టే progress report లు !! సొంతంగా చేసిన "నాన్న సంతకం" తప్పుని correct అని వాదించే సొంత ప్రయత్నం !! గొప్ప ప్రయాణం, మరిచిపోలేని మన బాల్యం!! ప్రతి మనసులో కరిగి,కన్నీరుగా మారె మధుర జ్ఞాపకం !!

ఐశ్వర్యం అంటే

1.తల్లిదండ్రులనురోజుచూడటం
2. అనుకువతి అయిన భార్య (భర్త  ) ఉండటం
3.చెప్పినమాట వినే సంతానం ఉండటామ్
4.ఋణాలు లేకపోవటం
5.మన అవసరానికి తగ్గ ధనము ఉండటం.
6.ఏదీ తిన్న అరిగించుకొనే శక్తి ఉండటం.
7.మనకోసం.కన్నీరు కార్చే మిత్రులు ఉండటం.
8.పది మందిలో గౌరవించాబడటం.
9.మంచి గురువు దొరకడం
10.మంచి నడవడికతో నడవడం
11.తల్లిదండ్రులను కడ దాకా చూసుకోవడం
12.చివరికి నలుగురిని మనకోసం సాధించుకోవడం
13.కడ దాక తోబుట్టువులుతో కలిసుండడం
14.ఆకలిగున్న వానికి పట్టేడన్నం పెట్టి వాని కళ్ళల్లో ఆనందం చూడడం
15.తల్లిపెట్టే చేతి ముద్ద తినడం
....ఇది ఐశ్వర్యం అంటే :) 😄
----------------------------------***---------------------------------
నా పల్లెలోనా వర్తమానం ..చేదు గుళికే ఆఇందోయమ్మ ... మనిషికి మనిషికి మధ్య పూడ్చలేని అగాధాలు పెరిగాయి ఓయమ్మా ....
స్వార్థం సర్వాంతర్యామిలా ప్రబలింది ....
అక్రమార్జన అందరి ద్యేయంగా మారింది ...మంచితనం అదృశ్యమయింది ...రాక్షసత్వం మానవత్వాన్ని కబళించింది ...పెద్దరికం కుక్కి మంచంలో ముడుచుకపోయింది ....మందలింపు రచ్చబండపై నుంచి మాయమైపోయింది నా పల్లెలోనా ...ఇప్పుడంతా ..ఎవరికీ వారే న్యాయ నిర్ణేతలు  యమ్మ ...ఇప్పుడు నాపల్లె నిర్జీవంగా మారిందోయమ్మ .. స్మశానాని తలపిస్తుందోయమ్మ ...

----------------------------------***---------------------------------
ఆయన  శ్రమజీవి.
రవి కంటే ముందే లేచి ఉరకలేస్తాడుమట్టినేలపై విత్తునాటి ఆశల వలవేస్తాడుచీకటి కరువుకు ఉరివేసి ఆకలి తీరుస్తాడు.
అంతంలేని ఆదిపత్య పొరుల్లోఎటుకొడితే అటుపడే బంతయ్యాడునెత్తుటి సంతకాల సంతాపాలల్లోకత్తులుదూసిన నేలలో విత్తులు కొనలేకపోయాడు.
సన్నకారు రైతులంతా సబ్సిడీలకై చేయిచాపారుఅభయమిచ్చే ఫ్యాక్షన్ గోళ్ళకు గుచ్చుకుపోయారు
అప్పుల జప్తులో కట్టువిప్పుకొన్న కాడెద్దులూఆలిబిడ్డల ఆకలితీర్చలేని అసమర్దుడయ్యాడు.
భూమిని తాకని చినుకుల కోతా ,విధ్యుత్ కోతా వడ్డీల మోతా ,ఆకలివాతా,....... వెరసిఎండిపోయిన ఎముకలగూడైనాడుఅన్నం పెట్టిన చేత్తో దణ్ణం పెడుతున్నాడు.
అన్నదాత నేడు అన్నదానానికై చేయిచాస్తున్నాడు అవును ఆతనిప్పుడుఆశ్రమ జీవి. !!  - Mekala Reddy
 ----------------------------------***--------------------------------- 
అధికారాన్ని అడ్డం పెటుకొనిప్రజాద్దనాన్ని దోచుకుంటున్న రాబందువులు ఎక్కువైనారు నా పల్లెలోనా .....
రైతులకు ఇచ్చే ప్రభుత్వ ఫలాలను , ప్రజా ప్రతినిధులే మెక్కేస్తున్నారు నా పల్లెలోనా ...
ఆపలేని పాలనా యంత్రంగంచోద్యం చూస్తుంది నా పల్లెలోనా ......
ఎవ్వరికి కనిపించని నిరుపేద రైతుల ఆకలి ఆర్తనాదాలు , ఆక్రన్దనలు ...
నేడు కనిపించే సజీవ దృశ్యాలు నా పల్లెలోనా ....
సాయం కరువై ---- వ్యవసాయం బరువైభూమితో పెనవెసుకున్న బంధాన్ని తెంచుకొని , ఉరి తాడుకు వేలాడుతున్నారు అన్నదాతలు నా పల్లెలోనా ...  Mekala Reddy
 ----------------------------------***---------------------------------
నీతో పాటు వెంటరాని వారి కోసం వెంటపడకు.. నీతో పాటు వెంట వచ్చేవారిని మరువకు.......
 ----------------------------------***---------------------------------
మన దేశంలో ప్రవేట్ కంపెనీలలో పనిచేసే వాచ్మెన్ కు ఉన్న గవురవంపల్లెలో రైతుకు దకడంలేదువ్యవసాయం చేసే రైతును వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు ___ ఇది మనముందు ఉన్న క్లిష్టమైన సమస్య_____################ పరిస్థితిని అదిగ మించడానికి రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలి  ప్రబుత్వాలు సమస్య పరిష్కారానికి దిర్గకాలిక ప్రణాళిక రచించాలి !!! ముక్యంగా వ్యవసాయ రంగంలో పరిశోదనలు చాల ముక్యంమన దేశంలో ఉనట్టువంటి పరిశోదన సంస్థలలోవ్యవసాయ విశ్వవిద్యాలయాలలో అనుకున్న స్థాయిలోపరిశోదనలు జరగడం లేదు . జరిగిన రైతులకు చేరడం లేదు .క్షెత్ర స్థాయిలో రైతులకు ఆదునిక పద్దతులలో,సమగ్రమైన శిక్షణ ఇవ్వాలి....
----------------------------------***---------------------------------
రాజకీయం నా భావవేశం ...... సేవ నాలోని బలహీనత ..... ఇక ఇప్పుడు చేసేదియేముంది .... ప్రాణమున్నదాకా పాకులాడాల్సిందే...  Mekala Reddy
 ----------------------------------***---------------------------------
ఎక్కడ విన్నానో ,సాదివానో గాని  మధ్య  గుర్తుకొచ్చి యాది చేస్తున్న............
నీ స్నేహితునిలో నచ్చనిది ఏమన్నా ఉంటె బాగు చేయి , లేకుంటే భరించు కానీవాన్ని కష్టపెట్టకు ....  Mekala Reddy
 ----------------------------------***---------------------------------
పోగవుతున్న భావాలను
పదిల పరిచేందుకుపెన్నుకాగితం తీసుకున్నా..! వసంతాన్ని కౌగిట చేర్చి,చిగురాకుల సందుల్లో చిందులేస్తూ,కానరాని కోకిలమ్మసరాగాలు పాడే తీరును రాద్దామనుకున్నా..!కాని,భుజాన నాగలిని నిలిపి..ఒళ్లంతా కమిలిన గాయాలతో,కాడెద్దులా మారి దున్నుతున్న రైతు కనిపించాడు.. !రక్తంతో తన పొలాన్ని తడుపుతూ.. కన్నీళ్ళతో చేనును దున్నుతూ ..అన్నపూర్ణను అందరికీ అందించాలనేతపనతో భగీరధునిలా మారిన  సంకల్పబలాన్ని చూస్తున్న నాకు అన్నం మేకు” అయిందనో
“ముద్ద” అయిందనోప్రక్కకు నెట్టే నేటి మనుషుల మనస్తత్వ పోకడలు ఒక్కసారిగాజ్ఞప్తికి వచ్చాయి.. !!నీటికోసం నింగివంకాపంటకోసం నేలవంకాఆశపడుతూ..పరుగుపెడుతూ.. నేలతల్లిని నమ్ముకొని,ఉన్నదంతా అమ్ముకొనిబిడ్డల కన్నా చేనే” ప్రాణమనుకొనిపొలాల మధ్య తిరుగుతూ బక్కచిక్కిన  కర్మలోకపు కర్షకుడి కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించట్లేదు ..  నాడు .. నీరుతో తడవాల్సిన భూములు రైతుల కన్నీళ్ళతో తడుస్తున్నాయి.. పచ్చగా పలకరించాల్సిన పంటలు బీడులై దీన స్థితితో చూస్తున్నాయి.. నిజంగానే ఇదో రంగుల ప్రపంచం.. 
“విద్య” వ్యపారమౌతోంది.. 
“వైద్యం” అంగట్లో వస్తువౌతోంది.. 
“బంధాలు” సెంటిమెంట్లు అవుతున్నాయి.. 
“అమ్మ” అద్దెకు దొరుకుతోంది.. 
“నాన్నకు చిరునామానే అవసరం లేదు..
“క్రమశిక్షణ మా ప్రత్యేకత” అన్న నినాదం.. 
“కంప్యూటర్ మా లక్ష్యం” గా మారుతోంది.. 
“జాతీయగీతం” పరదేశం ఆలాపన చేస్తుంది.. దేశాన్ని అమ్మేవారు దేశభక్తులు” అయ్యారు.. పొలాలు స్మశానాలు” అవుతున్నాయి.. ఇక్కడ అన్నంనీళ్ళు దొరకవు.. సెల్ పోన్లుకలర్ టీవీలుటాబ్ లుకార్లు చౌకగా దొరుకుతాయి.. ప్రేమ అమ్మబడుతుంది తూకానికి.. రక్తం చిమ్మబడుతుంది ఉత్త పుణ్యానికి” 
అదో మాయా ప్రపంచం.. అదే రంగుల ప్రపంచం.. 
 ----------------------------------***---------------------------------
అరకనే ఆయుధం చేసుకొని , ఆకలి పై యుద్ధం చేసే నా రైతన్నలకు వందనాలు..
రైతు చెమటకు కన్నీరు తోడై నేల తడవరాదు.....
శుభోదయం ..శుభదినం .నమస్కారం ..
----------------------------------***---------------------------------
Memories....
ఇది మనకోసం..

వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.

పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని, వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం 
చాలా దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు
స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.
మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం.
రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
VCR ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరం మనదే..
అలాగే కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో టచ్ లో ఉండేవాళ్ళం.

స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా

 మామూలు బట్టలతో వెళ్ళాం ...ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు
స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.

స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.


ఎవరూ ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం,

చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం.
జాతరలలో sweets అన్నీ తినేవాళ్ళం.

సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.

శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
ఆదివారం ఉదయం 9 కి పనులు తప్పించుకుని "మహాభారతము"  " రామాయణం"  " శ్రీకృష్ణ" చూసిన
 తరమూ మనదే...
ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే ..
ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.

రుపయికు థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం..


గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం..

మనమే.. మనమే అమ్మ 5 పైసలు ఇస్తే బఠానీలు తిన్నదీ మనమే..

గోర్లపైన కొంగ గోరు గుర్తులు... చువ్వాట..సిర్రగోనే ఆట..కోతి కొమ్మ...అష్ట చెమ్మ...ఆడిన తరము మనదే.

క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.

ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..

 అంతులేని ఆనందాన్ని పొందాం....ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు.
----------------------------------***---------------------------------
ఎవరికైనా ఉపకారం చెయ్యాలంటే ముందు మీ తల్లికి చేయండి...
ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి...
అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే... 
----------------------------------***---------------------------------
తలకి చెంపలంటా కారిపోయేలా నూనె రాసుకుని...
చేతికి పుస్తకాల సంచి(యూరియా సంచుల బ్యాగ్ లు) తగిలించుకుని...,
ఒక్కడిగా బయలుదేరి దారిలో ఫ్రెండ్స్ అందరూ...
ఒక్కొక్కళ్లు  కలుస్తూ పెద్దగుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికెళ్లే  తరంచూసినోడ్ని,

జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు లాక్కుంటు ..., చిరుగు బొక్కలకు కేసుమెంట్ లాగా గుడ్డ అతుకులేయించుకున్న వాళ్ళం

కాల్లకు చెప్పులేకుండానే పరుగులెట్టడం...
పోలీసులని...,
వాల్లని చూడగానే పరుగెట్టుకుని ఇంట్లోదూరే తరంవోన్ని..,

గోలీలాట,గోడెంబిల్ల,నేలబండ,అష్టాచెమ్మ, ఉప్పాట,ఏడుపెంకులాట,గుంటలో చిల్లర డబ్బులు కొట్టే ఆట,
బంతిచ్చుకుని డైరెట్టుగా కొట్టేసుకుంటే బంతిలాగ దద్దుర్లొచ్చే ముద్రబాల్ లాంటి ఆటలాడిన తరంవాడ్ని...,
బడికి ఎండాకాలం సెలవులు రాగానే చేతిలో తాటిముంజల బండితో తిరిగినోళ్లం...
దీపావళి కి తాటిబొగ్గుల రవ్వల దివిటి వళ్ళంతా మసిపూసుకొని మరీ తయారుచేసుకొంనోల్లం..

పది పైసలతో ఐస్ తిన్నది మేమె అదే పది పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మేమే....

వానొత్తే తాటాకు గొడుగూ,మైకా కాయితాలు యూరియా సంచులు కప్పుకుని..,
సెకండుహేండు టెస్టుబుక్సు కోసం పరీచ్చలైనకాన్నించి సీనియర్ని బతిమాలిన తరం వాడ్ని...,
స్కూల్స్ కాలేజిలల్లో గూడ ఎలచ్చన్లు జూసినోడ్ని....
పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మేమే...

ఉత్తరాలు.., రాసుకున్న..,అందుకున్న తరంవాడ్ని...

పండగ సెలవులు,
వేసవికాలం సెలవులు,దసరా సంక్రాంతి సెలవులు
ఎన్ని సెలవులొచ్చినా ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని అనుభవించిన తరంవోన్ని...,
శ్రీరామ నవమి తాటాకు పందిరికి రంగు కాయితాలు అంటించడం కోసం ముందురోజు రాత్రంతా జాగారం చేసింది మేమే...

జ్వరం వస్తె రొట్టి పాలుకోసం ఆశగా ఎదురుచూసిన తరం,
చుట్టమొస్తేనే అమ్మ నాటుకొడి కోసిన తరం వాడ్ని....
అత్తయ్యా,మావయ్యా,బావా,పిన్ని అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
స్కూలు మేష్టారు కనపడితే బయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం...,

పుల్లలపొయ్యి మీద అన్నం ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం వాడ్ని...,
చనక్కాయల్ని పుల్లలమీద కాలిస్తే అమ్మా నాన్నా బాబాయలు పిన్నులు అన్నలు దాదాపు పదిమంది ఓకేదగ్గర చేరి మధురమైన అనుభూతితో తిన్న తరం....

పొయ్యమీదనుంచి డైరెక్టుగా కంచంలొకే వచ్చిన వేడేడి అన్నంలో ఆవకాయ ఎన్నపూసేసుకుని పొయ్యికాడే కూకుని అన్నం తిన్నాతరం వాడ్ని...,
మామ్మలచేత నలుగు పెట్టించుకుని కొంకుడుకాయ పులుసుతో తలంటించుకున్న తరంవాడ్ని...,
బంగారం పొట్లం కట్టిన గులాబీరంగు కాగితం నవిలేసి నోరు ఎర్రగా వచ్చిందని ఆనందించిన

రేడియో,దూరదర్శన్,టూరింగ్ టాకీస్ ల కాలం...
ఎడ్లబండి మీద సకుటుంబ సమేతంగా సిన్మా కెల్లింది మా తరమే...

ప్రస్తుతం వున్న whatsup,  fb, skype లు మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం...,
మేమే ఆతరానికి ఈతరానికి మధ్యవర్తులం...,..
అవును మేమే మధ్యవర్తులం..😄🌹😄

అప్పటి గుండెలోతుల్లోనుంచి వచ్చిన ప్రేమని
ఇప్పుడు గుండీల పైనుంచి వచ్చే ప్రేమని చూసినోల్లం..,

ఓవిధంగా చెప్పాలంటే మేం అదృష్టవంతులం..,
*ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కాలంలో పని సంక్షోభం:* 😉🤔 మీ సలహాలు, సూచనలు తెలుపగలరు..ఆంధ్రప్రదేశ్ బాగుకోసం.. 😌 - _మీ మేకల వీ. రెడ్డి._ 😊 (01 Dec 2024)

*బీహార్* వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.

*ఒరిస్సా* వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.

*రాజస్థాన్* వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్‌ల నిర్వహణ చేస్తున్నారు

*ఉత్తరప్రదేశ్* వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు..

*కేరళ* వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.

ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు,

*కానీ తెలుగు రాష్ట్రము- ఆంధ్రప్రదేశ్ వాళ్లు మాత్రం:*

ఇంతో, అంతో చదువుకొన్నోళ్ళు *పట్టా/పొట్ట పట్టుకొని పొరుగు రాష్ట్రలకు/దేశాలకు వెలుతున్నారు* ..తల్లి, తండ్రులను మరియు సోంత వూరిని వదిలి..ఫలితంగా, తాలాలు వేసిన ఇళ్ళు దర్సనమిస్తున్నాయి మన పల్లెలు, పట్టణాలలో..

ఇక మిగిలిన వాళ్ళు (అందరూ కాదులేండి ☺️), *మందు, మాంసం* ఎవడు పంచుతాడు, ఎవడు ఎక్కువ *డబ్బులు* ఇస్తాడు అంటూ *పూటకో జెండా* చేతిలో పట్టుకుని తెలిసిన *పనిని*, చేతిలో ఉన్న *వృత్తినీ* వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ *ఉచితాలకు,* *వ్యసనాలకు* బానిసలై *జీవితాలను* నాశనం చేసుకుంటున్నారు.

*రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ (ఆదాయంలో) సంపదలో గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు, పని చేసే అలవాటు (Work Culture) కూడా మర్చి పోతారు. ఇది రాబోయే కాలంలో ఏపీ లోని వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుంది. ఆర్థిక, సమాజిక వేత్తలు ఈ విషయం లో మరింత వివరణ ఇవ్వగలరు.* 🤔

....

ఆంధ్రప్రదేశ్ కూడా కేరళ బాటలోకి (వలసలు, మనుషులు లేని ఇల్లు) రావడానికి ఎంతో దూరం లేదు అని ఘనాంకాలు చెపుతున్నయి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్లోనుంచి వలసలు (1990's) ముప్పైఏళ్ళుగా సాగుతూనే ఉన్నాయి.. 🤔

వయసులో కష్టపడి కట్టిన ఇళ్ళు మట్టిగొట్టుకొంటున్నాయి..పెంచిన/చదివించిన పిల్లలు అవసాన దశలో పెద్దగా ఉపయోగపడటము లేదు.. _*వయసుమీరిన వాళ్ళ పరిస్తితి వర్ణనాతీతం*_ !! 🥲🤔

.

Kerala Ghost houses: 1.3+ Mn houses are abandoned out of 10 mn houses in Kerala !!

https://www.newindianexpress.com/magazine/2024/Oct/05/the-ghost-houses-of-kerala

Teachers / schools struggle to get students in KL: https://www.bbc.com/news/world-asia-india-64936519

ఏమయ్యాయి ఆ గుర్తులు/ఆ ఆనందాలు !? 🤔 - రోట్లో రుబ్బిన మామిడి తొక్కు - నులక మంచం - ఆరుబయట.. - చేద బావి - దోసిట నీరు తాగడం - ఇంటి ముంగిట, పేడతో అలికి-ముగ్గులు.. - వేరుచెనగ కాయలు- కాల్చి తినడం.. - - కరుబూజ కాయ - పగులకొట్టి తినడము - చెట్టెక్కి మామిడి కాయలు వత్తి- మాగినవి అక్కడే తినడం.. - చెరకు గానుగ - లక్కిలి తినడం, చెరకు రసం తాగడము - మూడు మైళ్ళు నడిచివెల్లి సినిమా చూసి రావడము - జాతరకెల్లి నచ్చినవి తిని, ఆటలు ఆడి..అర్దరాత్రి ఇంటికి రావడము - ఎండాకాలం, బావుల్లో ఈత కొట్టడం, జామకాయలు, ఈతకాయలు, చీమచింత కాయలు తినడం.. - మొలకుల పౌర్ణమి - ఊరు-ఊరంతా చల్లని వెన్నెలలో, కొబ్బరి-బెల్లం-బొరుగులు తినడాము - ఎండాకాలం, మట్టిచేలలో కబడ్డి ఆడటము.., ఆరుబయట పడుకోవడము.. - వర్షా కాలం, వేడి-వేడిగా రొట్టెలు-ఎర్రకారం-వెన్నపూస, పకోడిలు .. - జిల్లా-కోడి - బంతాట - కొబ్బరికాయ పోటీలు - హరికథలు - మహా భారతం - తోలుబొమ్మలాట - నాటకాలు - రికార్డ్ డ్యాన్సులు ఇలా ఎన్నో వినోదాలు.. ....రాస్తూ పోతే ఎన్నో..ఎన్నెన్నో.. ఏది ఏమైనా మా వూరంటే ఇష్టం, ఎందుకంటే అక్కడ చెట్టు, పుట్ట, రాయి, బావి అన్ని మాట్లాడిస్తాయి కాబట్టి..- ఆనందముతో మీతో పంచుకొంటున్నా ఇక్కడ - _మేకల వీ. రెడ్డి 😉* 16 Jun 2024

No comments:

Post a Comment

Kondareddygaripalli

కొండా రెడ్డి గారి పల్లి, పెద్దగొట్టిగల్లు  Native Place: where every stone & Tree have a story to tell.. నా ఊరు పల్లెటూరు ... ప్రకృత...